Naval command: అబ్బురపరచిన నౌకాదళ విన్యాసాలు

కేరళలోని కొచ్చిలో సదరన్‌ నావల్‌ కమాండ్‌ ప్రదర్శించిన సాహస విన్యాసా చూపరులను అబ్బురపరిచాయి. విన్యాసాలను రాష్ట్రపతి...

Published : 22 Dec 2021 21:51 IST

కొచ్చి: కేరళలోని కొచ్చిలో సదరన్‌ నావల్‌ కమాండ్‌ ప్రదర్శించిన సాహస విన్యాసా చూపరులను అబ్బురపరిచాయి. విన్యాసాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిలకించారు. అనంతరం నౌకాదళం స్టేషన్‌లోని విక్రాంత్‌ సెల్‌ను సందర్శించారు. నౌకాదళ గగన విన్యాసాలు అబ్బురపరిచాయి. హెలికాప్టర్‌ ద్వారా కారును ఆకాశంలోకి తీసుకెళ్లే విన్యాసాలు చూపరులను ఆశ్చర్య చకితం చేశాయి.సదరన్‌ నావల్‌ కమాండ్‌ నిర్వహించిన ప్రదర్శనలో నౌకాదళం సభ్యులు ధైర్య సాహసాలు, సాహసోపేతమైన సాయుధ కార్యకలాపాలకు సంబంధించిన ప్రదర్శనలు ఇచ్చారు. భారత నౌకాదళం బలీయమైన సామర్థ్యాలకు సాక్ష్యంగా ఈ విన్యాసాలు నిలిచాయి.మార్కోస్‌ (మెరైన్‌ కమాండోలు)  యుద్ధం, దాడులకు సంబంధించిన ప్రదర్శనలు కనువిందు చేశాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని