New Year 2022: నవభారత నిర్మాణంలో 2022 బంగారు పుట కావాలి..!

కాలగమనంలో మరో ఏడాది పూర్తయ్యింది. కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇకనైనా బయటపడాలనే కాంక్షతో, కొంగొత్త ఉత్సాహంతో 2022కు స్వాగతం చెబుదాం. నూతన సంవత్సరాది

Updated : 01 Jan 2022 11:33 IST

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

దిల్లీ: కాలగమనంలో మరో ఏడాది పూర్తయ్యింది. కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇకనైనా బయటపడాలనే కాంక్షతో, కొంగొత్త ఉత్సాహంతో 2022కు స్వాగతం చెబుదాం. నూతన సంవత్సరాది సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వసంతంలో కొత్త శిఖరాలను అధిరోహిద్దామంటూ ప్రధాని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’ సమయంలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ను మోదీ షేర్‌ చేశారు. నవ భారత నిర్మాణంలో 2022 ఏడాదిని బంగారు పుటగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం పాటుపడదాం అంటూ పిలుపునిచ్చారు. 

దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సమాజం, దేశం నలువైపులా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఈ కొత్త ఏడాదిని ఉత్సాహంగా స్వాగతిద్దాం. 2022 ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, విజయం, శాంతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా

- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆరంభాల సమయం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన సమయం. తోటివారి పట్ల మరింత దయతో ఉండాలని సంకల్పిద్దాం

- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

హ్యాపీ 2022. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం నిండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. అభివృద్ధి, శ్రేయస్సులో కొత్త శిఖరాలను అధిరోహిద్దాం. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసేందుకు మరింత కష్టపడదాం

- ప్రధాని మోదీ 

ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరంలో సానుభూతి, సమానత్వం, ఐక్యత ఉండాలని ఆశిస్తున్నా

- కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని