Republic Day: ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘ఆత్మనిర్భర్’ ఆయుధాలు
దేశంలో గణతంత్ర వేడుకలు(Republic Day) ఘనంగా సాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు
దిల్లీ: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మొదటిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాలు ప్రపంచానికి తమ సత్తాను చాటిచెప్పాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు ఆకర్షణగా నిలిచాయి. ఉదయం పదిన్నరకు విజయ్‌చౌక్ వద్ద కవాతు మొదలై ఎర్రకోట వరకు సాగుతోంది. దీనిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
♦ గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu)జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాష్ట్రపతితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సైనిక దళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చిన 120 మంది సైనికుల ప్రత్యేక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది.
♦ కర్తవ్య్‌పథ్ పరేడ్‌లో భారత నౌకాదళం, వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 861బ్రహ్మోస్ రెజిమెంట్ డిటాచ్‌మెంట్ ఈ కవాతులో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్‌ఎఫ్ బృందం ఆకట్టుకుంది.
♦ 8711 ఫీల్డ్ బ్యాటరీ బృందం ‘21 గన్ సెల్యూట్’ కోసం దేశీయంగా తయారు చేసిన 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ వాడింది.
సాయుధ దళాల మెరుపులు..
♦ అర్జున్ ట్యాంకులు - కెప్టెన్ అమన్‌జీత్
♦ నాగ్ మిసైల్ వ్యవస్థలు - లెఫ్టినెంట్ సిద్ధార్థ్ త్యాగి
♦ బీఎంపీ-2 వాహనాలు- కెప్టెన్ అర్జున్ సిద్ధూ
♦ లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్‌కు చెందిన క్విక్ రియాక్షన్ పోరాట వాహనాలు- కెప్టెన్ నవీన్ దత్తేర్వాల్
♦ కె-9 వజ్ర-టి ట్యాంకులు - లెఫ్టినెంట్ ప్రఖర్ తివారీ
♦ బ్రహ్మోస్-816 రెజిమెంట్- లెఫ్టినెంట్ ప్రజ్వల్ కాల
♦ మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ - కెప్టెన్ హర్ష్‌దీప్ సింగ్
♦ 64 అసాల్ట్ ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన 10 మీటర్ల షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ వాహనాలు- కెప్టెన్ శివశీష్ సోలంకి
♦ 2 ఏహెచ్‌క్యూ సిగ్నల్ రెజిమెంట్‌కు చెందిన ‘మొబైల్ మైక్రోవేవ్ నోడ్ అండ్ మొబైల్ నెట్‌వర్క్ సెంటర్’ - మేజర్ మొహిద్ ఆసిఫ్ అహ్మద్
♦ అమృత్‌సర్ ఎయిర్ ఫీల్డ్‌కు చెందిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ - కెప్టెన్ సునీల్ దశరథ్
♦ నేవీ కవాతు బృందం - లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్
♦ వాయుసేన కవాతు బృందం - స్క్వాడ్రన్ లీడర్ సింధూ రెడ్డి
♦ వాయు సేన, భారత నేవీ, డీఆర్‌డీవో శకటాలను ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్