కర్నూలు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14

Updated : 14 Feb 2021 13:39 IST

దిల్లీ: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు మహిళలు, చిన్నారి మృతిచెందడం హృదయ విదారక విషయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

రోడ్డు ప్రమాదంలో పలువురు మృతిచెందడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

మదనపల్లె నుంచి అజ్మీర్‌ వెళుతూ రోడ్డు ప్రమాదంలో పలువురు మృతిచెందడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన విచారకరమన్నారు. ఈ విషాద సమయంలో ఆత్మీయులను కోల్పోయిన వారితో తన ఆలోచనలుంటాయన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. 

ఇవీ చదవండి..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

కర్నూలు ప్రమాదం: రూ.2లక్షల చొప్పున పరిహారం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని