
రాష్ట్రపతి కోవింద్‌కు బైపాస్ సర్జరీ
దిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు.
‘‘దిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడాను. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
ఛాతీలో అసౌకర్యం కారణంగా ఈ నెల 26న రాష్ట్రపతి కోవింద్ దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు సిఫార్సు చేశారు. గత శనివారం ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.