రామమందిరానికి రాష్ట్రపతి రూ.5లక్షల విరాళం

అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళం ఇచ్చారు. రూ. 5,00,100 చెక్కును రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులకు అందించారు.

Updated : 15 Jan 2021 14:49 IST

దిల్లీ: అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళం ఇచ్చారు. రూ. 5,00,100 చెక్కును రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులకు అందించారు. మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామ జన్మభూమి ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌ నేడు ప్రారంభించాయి. 

రామ జన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితర ప్రతినిధులు ఈ ఉదయం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రూ.5లక్షల చెక్కును రామ్‌నాథ్‌ కోవింద్‌ విరాళంగా అందించారు. నిధి సేకరణలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా దేశంలోని ప్రముఖులను కలిసి విరాళాలు అడగనున్నారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుంచి విరాళాల సేకరణ ప్రారంభించనున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్‌ గతంలోనే ప్రకటించింది. ఫిబ్రవరి 27వరకు సాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరించనున్నట్లు తెలిపింది. నిధుల సేకరణలో పారదర్శకత ఉండేందుకు గానూ.. రూ. 20వేలు అంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చే విరాళాన్ని చెక్కుల రూపంతో తీసుకోనున్నట్లు పేర్కొంది. అంతేగాక, రూ. 2వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని నిర్ణయించింది. విరాళాల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్‌ భావిస్తోంది.

ఇవీ చదవండి..

మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది

వాటర్‌బాటిల్‌పై కేసు.. ఐదేళ్ల తర్వాత గెలుపు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని