రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అస్వస్థత

దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో స్వల్ప అసౌకర్యానికి గురవడంతో ఈ ఉదయం దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. వైద్య

Updated : 26 Mar 2021 13:42 IST

దిల్లీ: దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో స్వల్ప అసౌకర్యానికి గురవడంతో ఈ ఉదయం దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాయి.

రాష్ట్రపతి ఇటీవల కరోనా టీకా వేయించుకున్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న దిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు. ఆ తర్వాత మార్చి 8న మహిళా దినోత్సవం నాడు ఆయన సతీమణి, తొలి మహిళ సవితా కోవింద్‌ కూడా టీకా తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని