Madhya Pradesh: ప్రైమరీ స్కూల్‌ టీచర్‌.. 20 కాలేజీలకు యజమాని..!

ఆయనో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు.. నెలకు వచ్చే జీతం వేలల్లోనే ఉంది. కానీ ఆయన ఆస్తులు మాత్రం సంపాదన కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. అంతేనా..

Published : 29 Mar 2022 02:08 IST


(ప్రతీకాత్మక చిత్రం)

గ్వాలియర్‌: ఆయనో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు.. నెలకు వచ్చే జీతం వేలల్లోనే ఉంది. కానీ ఆయన ఆస్తులు మాత్రం సంపాదన కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. అంతేనా.. ఏకంగా 20 కాలేజీలకు యజమాని కూడా.. అధికారులు నివ్వెరపోయిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్‌లోని ఘాటిగావ్‌ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ పార్మర్‌.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన వేలకొద్దీ అక్రమాస్తులు సంపాదిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌(ఈఓడ్ల్యూ) అధికారులు ఇటీవల ప్రశాంత్‌ ఇల్లు, ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టగా.. ఆయన ఆస్తులు చూసి  అవాక్కయ్యారు.

ప్రశాంత్‌కు గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో బీఈడీ, డీఈడీ కోర్సులు బోధించే 20 కళాశాలలు ఉన్నట్లు సోదాల్లో బయటపడింది. దీంతో పాటు నాలుగు ఆఫీసులు, 3 నర్సింగ్‌ కాలేజీలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ ఆస్తుల విలువ ఆయన సంపాదన కంటే 1000 రెట్ల కంటే ఎక్కువేనట. ప్రశాంత్‌ 2006లోనే టీచర్‌గా విధుల్లో చేరారు. అప్పుడు ఆయన నెల జీతం రూ.3500 మాత్రమే. ఆయన ఇంట్లో దొరికిన కాలేజీ పత్రాలతో పాటు ఇతర ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాలు, లాకర్లను పోలీసులు గుర్తించారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని