Corona: అక్కడ 16 నుంచి స్కూళ్లు ఓపెన్‌.. నైట్‌ కర్ఫ్యూ కొనసాగింపు!

కరోనా ప్రభావంతో మూతపడిన పాఠశాలల్ని ఫిబ్రవరి 16 నుంచి పునఃప్రారంభించనున్నట్టు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వెల్లడించింది....

Published : 14 Feb 2022 23:36 IST

కోల్‌కతా: కరోనా ప్రభావంతో మూతపడిన పాఠశాలల్ని ఫిబ్రవరి 16 నుంచి పునఃప్రారంభించనున్నట్టు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వెల్లడించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటీసులు జారీచేసింది. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు కొనసాగించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నప్పటికీ నైట్‌ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని అధికారులు స్పష్టంచేశారు. ప్రతి రోజూ అర్ధరాత్రి 12గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలతో పాటు అన్ని వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.  కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. కొవిడ్‌ వ్యాప్తి నివారించేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌లో గత నెలతో పోలిస్తే భారీ సంఖ్యలో కేసులు తగ్గుముఖం పట్టాయి. జనవరి 14న 46వేలకు పైగా కొత్త కేసులు నమోదుకాగా.. నిన్న కేవలం 512 కేసులు మాత్రమే రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని