PM Modi: అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు.. కాని జ్ఞానం కాదు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు.

Updated : 19 Jun 2024 14:03 IST

పట్నా: బిహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం నలంద విశ్వవిద్యాలయం(Nalanda University) కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర వి.అర్లేకర్, ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ నలంద విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి చిహ్నం అని పేర్కొన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని కొనియాడారు. ఈ కొత్త క్యాంపస్‌ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందన్నారు. అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు కాని జ్ఞానం కాదని వివరించారు. 

ఐదో శతాబ్దంలో స్థాపించిన పురాతన నలంద విశ్వవిద్యాలయానికి అప్పట్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకొనేవారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నలంద విశ్వవిద్యాలయం 800 సంవత్సరాల పాటు తన సేవలు అందించింది. 12వ శతాబ్దంలో దేశంలోకి వచ్చిన ఆఫ్ఘన్లు ఈ విశ్వవిద్యాలయాన్ని కూల్చివేశారు. అందులోని పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌లను తగులబెట్టారు. ఈ ప్రాంతాన్ని 2016లో ఐక్యరాజ్యసమితి(United Nations) వారసత్వ సంపద(Heritage site)గా ప్రకటించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని