Published : 26/06/2021 13:59 IST

Ayodhya:అయోధ్య అభివృద్ధిపై మోదీ, యోగి సమావేశం

దిల్లీ: అయోధ్య నగరంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించే నిమిత్తం ప్రధాని మోదీ శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ నెలలో వారిద్దరి మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం చేపట్టిన భూముల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దాంతో తాజాగా నిర్వహించిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. నేటి సమావేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయంతోపాటు అయోధ్య అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను యోగి ప్రధానికి సమర్పించారు.  

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. అక్కడి రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఒకదశలో ముఖ్యమంత్రిని కూడా మార్చుతారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ క్రమంలో కొద్దిరోజుల క్రితం యోగి దిల్లీలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో భేటీ అయ్యారు. 

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని