PM modi: మీడియాతో ప్రధాని మోదీ రేపు ఇష్టాగోష్ఠి?

ప్రధాని నరేంద్రమోదీ (PM modi) మీడియాతో ఇష్టాగోష్ఠిగా బుధవారం మాట్లాడే అవకాశం ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియా ప్రతినిధులతో మోదీ ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్‌ సెక్రటరీ తెలిపారు.

Published : 06 Dec 2022 20:09 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ (PM modi) మీడియాతో ఇష్టాగోష్ఠిగా బుధవారం మాట్లాడే అవకాశం ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియా ప్రతినిధులతో మోదీ ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్‌ సెక్రటరీ తెలిపారు. సాధారణంగా బహిరంగ సభలు, టీవీలు, మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడడం తరచూ జరిగేదే. కానీ, నేరుగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం అరుదు. ఈ నేపథ్యంలో ఈ ఇష్టాగోష్ఠి ప్రాధాన్యం సంతరించుకుంది.

డిసెంబర్‌ 7 నుంచి 29 వరకు జరిగే పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. అటు అధికార పార్టీతో పాటు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ధరల పెరుగుదల, భారత్‌-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులపై చర్చించాలని విపక్షాలు కోరాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని బిజూ జనతా దళ్‌ డిమాండ్‌ చేయగా.. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని శిందే వర్గానికి చెందిన శివసేన కోరింది. 17 రోజుల పాటు జరిగే సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని