Bihar: విద్యార్థుల ఎదుటే తన్నుకున్న మహిళా టీచర్లు.. వీడియో వైరల్
Principal teachers Fight: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే విపరీత చర్యకు దిగారు. విద్యార్థుల కళ్లముందే కొట్లాడుకున్నారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
పట్నా: బిహార్ (Bihar) విద్యావ్యవస్థలో లోపాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్.. మార్కుల జాబితాల్లో అవకతవకలు.. ఇలా గతంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ పాఠశాలలో విద్యార్థుల కళ్లముందే మహిళా టీచర్లు తన్నుకున్నారు. జుట్టుపట్టుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. (Principal teachers Fight)
పట్నాలోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిటికీ తలుపులు మూయడంపై ప్రధానోపాధ్యాయురాలు, టీచర్ల మధ్య ఘర్షణ మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు (Principal) కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ కాంతి కుమారి క్లాస్‌రూమ్ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు స్థానిక మీడియా ప్రతినిధులు సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్ (Viral Video)గా మారింది. దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నరేశ్ స్పందించారు. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్ స్వామి
-
India News
పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!
-
General News
TS High Court: భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు
-
World News
USA: విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్.. సానిక్ బూమ్‌తో హడలిన వాషింగ్టన్
-
India News
Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఓవల్ మైదానంలో టీమ్ఇండియా రికార్డులు ఇలా..