Taloja jail: తలోజా జైలులో నేరగాళ్లకు నిద్రలేని రాత్రులు

‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అన్నట్టు.. సమాజంలో అడ్డగోలుగా ఘోరాలకు పాల్పడి ముంబయి శివారులోని తలోజా జైలుకు చేరిన పలువురు నేరగాళ్లకు దోమలు చుక్కలు చూపిస్తున్నాయి.

Updated : 05 Nov 2022 08:28 IST

దోమల బాటిల్‌ జడ్జికి చూపిన దావూద్‌ అనుచరుడు

ముంబయి: ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అన్నట్టు.. సమాజంలో అడ్డగోలుగా ఘోరాలకు పాల్పడి ముంబయి శివారులోని తలోజా జైలుకు చేరిన పలువురు నేరగాళ్లకు దోమలు చుక్కలు చూపిస్తున్నాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు ఒకప్పుడు అనుచరుడిగా మసలిన గ్యాంగ్‌స్టర్‌ ఎజాజ్‌ లక్డావాలా చచ్చిన దోమలను ఏకంగా కోర్టుకే తీసుకువచ్చాడు. ప్లాస్టిక్‌ బాటిలు నిండా ఉన్న దోమలను సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తికి చూపించి దోమతెరకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించాడు. గురువారం జరిగిన ఈ ఘటన కోర్టు హాలులో కలకలం రేపింది. పలు క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న లక్డావాలా అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. 2020 జనవరిలో అరెస్టయిన ఇతను నవీ ముంబయి సమీపంలోని తలోజా జైలులో ఉంటున్నాడు. గతంలో ఇతనికి దోమతెర ఇచ్చిన అధికారులు భద్రత కారణాలతో ఆ సదుపాయం తొలగించారు. లక్డావాలా దరఖాస్తును కొట్టివేసిన న్యాయమూర్తి ఒడొమస్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు  చూడాలని సూచన చేశారు. తలోజా జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న ఇతరులు సైతం దోమతెరల కోసం గతంలో కోర్టును పలుమార్లు అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని