- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Precaution Dose: మహమ్మారి నుంచి మరింత సురక్షితం.. మొదలైన ప్రికాషన్ డోసు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉంచేందుకు 18 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో వచ్చాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలు కూడా తగ్గడంతో మూడో డోసు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు తర్వాత తొమ్మిది నెలలు పూర్తయినవారు ఈ మూడో డోసు తీసుకునేందుకు అర్హులు.
ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న ప్రికాషన్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. కాగా ఇప్పటివరకు 2.4 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైనున్నవారికి ఈ డోసును పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూర్తయ్యింది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.
ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానున్న ఒకరోజు ముందే (శనివారం) వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆసుపత్రులకు కొవిషీల్డ్ టీకా డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులకు కొవాగ్జిన్ టీకా డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. అయితే ఈ టీకా ధరలకు సర్వీసు ఛార్జీ అదనం. ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు కేంద్రాలను సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Journalist’s daughter: తండ్రి కోసం ఆరాటం.. ఆమె నోట ప్రసంగమై..!
-
World News
China: ఉద్యమకారులకు మానసిక చికిత్స.. చైనాలో మరో దారుణం..!
-
Politics News
Nadendla: అందుకే అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్: నాదెండ్ల మనోహర్
-
Politics News
BJP: భాజపా కీలక కమిటీ నుంచి గడ్కరీ, చౌహాన్ ఔట్
-
Sports News
BCCI : విదేశీ లీగుల్లో ధోనీ.. బీసీసీఐ ఏమందంటే..?
-
Politics News
DK Aruna: దోపిడీకి అడ్డు చెప్పకుంటే ప్రధాని మిత్రుడు.. లేదంటే శత్రువా?: డీకే అరుణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్కు మంచిది!
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..