
Priyanka Gandhi: ‘మహిళలు అర్ధరాత్రి రోడ్లపై తిరగొచ్చనడం వట్టి మాటే’
లఖ్నవూ: భాజపా ప్రభుత్వంపై వరుస విమర్శలు చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ.. తాజాగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు! ఉత్తర్ప్రదేశ్లో యువతులు నగలు ధరించి, అర్ధరాత్రి సమయంలోనూ రోడ్లపై నిర్భయంగా తిరగగలరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యను ‘జుమ్లా’గా అభివర్ణించారు. గత నెలలో యూపీలో నిర్వహించిన ఓ సభలో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రశంసిస్తూ.. షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో అసలైన పరిస్థితులు ఏంటో రాష్ట్ర మహిళలకు మాత్రమే తెలుసని ప్రియాంక పేర్కొన్నారు.
కాన్పూర్లో వేర్వేరు చోట్ల ముగ్గురు మహిళల గొలుసు చోరీ ఘటనలపై వచ్చిన ఓ కథనాన్ని ఉటంకిస్తూ.. ప్రియాంక ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘రాజకీయాలతోపాటు భద్రతకు సంబంధించిన విధానాల రూపకల్పనలోనూ మహిళల భాగస్వామ్యం అవసరం. అందుకోసమే ‘మై లడికీ హూ.. లడ్ సక్తీ హూ(నేను మహిళను.. పోరాడగలను)’’ స్ఫూర్తి అవసరమని చెప్పుకొచ్చారు. ఇదే వ్యాఖ్యపై ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ప్రియాంకకు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఇంట్లో అబ్బాయి ఉన్నాడు. కానీ పోరాడలేడు’ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.