దిల్లీ పేలుడు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత

దేశ రాజధాని దిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది.

Published : 02 Feb 2021 15:46 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను కూడా గుర్తించారు. ‘‘ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాం.’’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి..

కొవిడ్‌ మహమ్మారికి 160 మంది వైద్యులు బలి

జైలులో పద్మజ కేకలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని