UNLOCK: దిల్లీలో వీటిని తెరిచేందుకు అనుమతి

సోమవారం నుంచి బార్లు, పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ, దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 01 Apr 2022 15:53 IST

న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సెకండ్‌వేవ్‌ తీవ్రత దాదాపు తగ్గిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చింది. సోమవారం నుంచి బార్లు, పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ, దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. 50శాతం సామర్థ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బార్లు తెరిచి ఉంచవచ్చని తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు సక్రమంగా అమలు చేసే బాధ్యత బార్ల యజమానులదే. ఇక పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలు, గోల్ఫ్‌ క్లబ్‌లు, ఆరు బయట యోగా కార్యక్రమాలకు కూడా డీడీఎంఏ అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, సినిమాలు, జిమ్‌లు, స్పాలలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదు.

మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ పొడిగించిన తమిళనాడు

మరోవైపు తమిళనాడులో లాక్‌డౌన్‌ను జూన్‌ 28వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, కొన్ని జిల్లాల్లో కొవిడ్‌ నిబంధనలను సడలించారు. నిత్యావసర దుకాణాలు, కూరగాయల మార్కెట్‌లను ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ తెరిచి ఉంచవచ్చు. రెస్టారెంట్లు, టీ స్టాల్స్‌ నుంచి పార్సిల్‌ సేవలు, ఇ-కామర్స్‌ సేవలు, స్వీట్‌షాపులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు ఆఫీసుల్లో 33శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని