Omicron: ఒమిక్రాన్‌పై పోరుకు ప్రత్యేక టీకా.. రూపొందిస్తున్న ఫార్మా సంస్థ!

ఒమిక్రాన్‌పై పోరుకు ప్రత్యేకంగా ఓ టీకాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోని పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ ఒమిక్రాన్‌ కోసం ప్రత్యేక టీకాను తయారుచేస్తోందని.......

Published : 18 Jan 2022 01:43 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అనేక దేశాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో ఈ వేరియంట్‌వే అధిక శాతం ఉంటున్నాయని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై పోరుకు ప్రత్యేకంగా ఓ టీకాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోని పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ ఒమిక్రాన్‌ కోసం ప్రత్యేక టీకాను తయారుచేస్తోందని.. నెల, రెండు నెలల్లో అది సిద్ధం కానున్నట్లు సమాచారం. అయితే దీన్ని బూస్టర్ లేదా స్వతంత్ర వ్యాక్సిన్‌గా రూపొందించేందుకు మరికొద్ది రోజుల్లోనే ట్రయల్స్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు జెన్నోవా కంపెనీ ‘HGC019’ ఎంఆర్‌ఎన్‌ఏ (mRNA) ఆధారిత టీకాను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిపై గతంలోనే తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసి మధ్యంతర ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDCSO)కు అందించింది. ఆ సమాచారాన్ని సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ విశ్లేషించి.. రోగనిరోధకతను ఇవ్వడంతో పాటు టీకా సురక్షితమైనదేనని నిర్ధారించింది. దీంతో రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కాగా రెండో దశ పరీక్షలు నిర్వహించిన సంస్థ.. ఈ వివరాలను శుక్రవారం డీసీజీఐకి పంపినట్లు సమాచారం. ఈ టీకాకు అనుమతి లభిస్తే.. దేశంలోనే మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఇదే కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు