Sunglasses: చిప్స్‌ ప్యాకెట్లతో కళ్లద్దాలు తయారీ!

పుణె(Pune)కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ చిప్స్‌ ప్యాకెట్‌ (Chips Packets)లను రీసైకిల్‌ చేసి దాన్నుంచి సేకరించిన ప్లాస్టిక్‌తో సన్‌గ్లాసెస్‌(Sunglasses)ను తయారుచేసింది. ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌ ఇదేనని సదరు కంపెనీ చెబుతోంది.

Published : 18 Feb 2023 01:26 IST

పుణె: ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ (PM Narendra Modi) ధరించిన నీలం రంగు జాకెట్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇందుకు కారణం.. ఆ జాకెట్‌ను ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేయడమే. తాజాగా పుణె(Pune)కు చెందిన ఆశయ విత్‌ఔట్‌ (Ashaya Without) స్టార్టప్‌ కంపెనీ ఇదే తరహా ఆలోచనతో సన్‌గ్లాసెస్‌(Sunglasses)ను తయారు చేసింది. చిప్స్‌ ప్యాకెట్‌ (Chips Packets)లను రీసైకిల్‌ చేసి దాన్నుంచి సేకరించిన ప్లాస్టిక్‌తో ఈ కళ్లజోడును డిజైన్ చేసింది. ప్రపంచంలోనే మొదటి రీసైకిల్డ్‌ సన్‌గ్లాస్‌ ఇదేనని సదరు కంపెనీ చెబుతోంది. ఆర్‌ సన్‌గ్లాసెస్ (rSunglasses) పేరుతో తీసుకొచ్చిన ఈ కళ్లజోడును తీసుకొచ్చారు.  మల్టీలేయర్డ్‌ ప్లాస్టిక్స్‌ (Multi-Layered Plastics) నుంచి వీటిని తయారు చేసిన విధానానికి సంబంధించిన వీడియోను కంపెనీ వ్యవస్థాపకుడు అనీష్‌ మల్పానీ (Anish Malpani) ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

‘‘ఇప్పటిదాకా  నేను భాగమైన వాటిలో ఇదే కష్టమైనది. చిప్స్ ప్యాకెట్లతో భారత్‌లో తయారుచేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి సన్‌గ్లాసెస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. ఇందులో చిప్స్ ప్యాకెట్లను సేకరించి వాటి రీసైకిల్ చేసి.. వాటి నుంచి సేకరించిన ప్లాస్టిక్‌తో కళ్లజోడు తయారు చేయడం చూడొచ్చు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ కళ్లజోడు ధర రూ.1,099. కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు