Reel: రీల్స్‌ పిచ్చి పీక్స్‌.. యువతి డేంజరస్‌ స్టంట్‌!

రీల్స్‌ కోసం ఓ యువతి ఎత్తయిన భవనం నుంచి వేలాడుతుండగా.. మరో యువకుడు ఆమె చేతిని పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు మండిపడ్డారు. 

Updated : 20 Jun 2024 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ సమయంలోనే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ ఐపోయేందుకు కొందరు ఎంచుకుంటున్న మార్గం రీల్స్‌. వాటి కోసం సాహసాలకు తెగిస్తున్నారు. ప్రమాదకర స్టంట్లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కొందరిలో మాత్రం మార్పు కొరవడింది. తాజాగా రీల్స్‌ మోజులో పడిన ఇద్దరు టీనేజర్లు.. వాటికోసం డేంజరస్‌ స్టంట్లు చేసిన వీడియో వైరల్‌గా మారింది.

ఎత్తయిన భవనం నుంచి ఓ యువతి కిందకు వేలాడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ ఘటన పుణెలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మత్తుమందు ఇచ్చి అబ్బాయిని అమ్మాయిగా మార్చి.. ఓ యువకుడి భయానక ప్రేమ

‘‘పోలీసులు వెంటనే వీరిని అదుపులోకి తీసుకోవాలి’’ అని ఒకరు.. ‘‘ఆలోచన ఉన్నవారు ఇలాంటి సాహసాలకు పాల్పడరు. దీని ద్వారా వారు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు’’ అని మరొకరు పోస్టు పెట్టారు. ‘‘రీల్స్‌ కోసం డేంజరస్‌ స్టంట్లకు పాల్పడే వారిని అరెస్టు చేయాలి’’ అంటూ కామెంట్లతో మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని