Punjab: పంజాబ్‌ కేబినెట్‌ విస్తరణ.. కొత్తగా మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కేబినేట్‌లో మరో ఐదుగురికి చోటు లభించింది. ఈ మేరకు కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

Published : 04 Jul 2022 21:04 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కేబినెట్‌లో మరో ఐదుగురికి చోటు లభించింది. ఈ మేరకు కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి మంత్రి వర్గ విస్తరణ కావడం గమనార్హం.

భగవంత్‌ మాన్‌ మంత్రివర్గంలో కొత్తగా అమన్‌ అరోరా(సునం నియోజకవర్గం), సింగ్‌ నిజ్జర్‌(అమృత్‌ సర్‌ సౌత్‌), ఫౌజా సింగ్‌ సరారీ(గుర్‌ హర్‌ సాహీ), చేతన్‌ సింగ్‌ జౌరామజ్రా(సమానా), అన్మోల్‌ గగన్ మాన్‌(ఖరార్‌) ఉన్నారు. మాన్‌ కేబినేట్‌లో అన్మోల్‌ గగన్‌ మాన్‌ రెండో మహిళా మంత్రిగా నిలిచారు. మొదటి మహిళా మంత్రి బల్జిత్‌ కౌర్‌ ఉన్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకుగానూ.. 92 సీట్లను కైవసం చేసుకొని ఆప్‌ ప్రభుత్పాన్ని ఏర్పాటు చేసింది. 18 మంది మంత్రులకు చోటు ఉన్న కేబినెట్‌లో అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టారు. తాజాగా చేరిన ఐదుగురితో కేబినెట్‌లోని మొత్తం మంత్రుల సంఖ్య 15కు(ముఖ్యమంత్రితో సహా) చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని