Published : 04 Jul 2022 01:46 IST

Punjab: పంజాబ్‌ కేబినేట్‌ విస్తరణ.. కొత్తగా మరో ఐదుగురికి చోటు!

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. జులై 4న ఐదుగురు ఎమ్మెల్యేలను తన కేబినెట్‌లో చేర్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. అక్కడి రాజ్‌భవన్‌లో రేపు(సోమవారం) సాయంత్రం 5గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిసింది. కొత్త వారి చేరికతో కేబినెట్‌లోని సభ్యుల సంఖ్య 15(ముఖ్యమంత్రితో సహా)కు చేరనుంది.

భగవంత్‌ మాన్‌ కేబినెట్‌లో కొత్తగా చేర్చుకునే వారిలో అమన్‌ అరోరా(సునం నియోజకవర్గం), సర్వ్‌జిత్‌ కౌర్‌ మనుకే(జగ్రావ్‌), బల్జిందర్‌ కౌర్‌(తల్వాండీ సబో), బుద్‌ రామ్‌(బుద్‌లాడా), సింగ్‌ నిజ్జర్‌(అమృత్‌ సర్‌ సౌత్‌), అన్మోల్‌గగన్‌ మాన్‌(ఖరార్‌) ఉండనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాగా.. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకొని భగవంత్‌ మాన్ సారథ్యంలో అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, మూడు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో కలుపుకొని 10 మంది ఎమ్మెల్యేలతో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా కేబినేట్‌ను విస్తరించి మరికొంత మందికి మంత్రి పదవులు కట్టబెట్టాలని మాన్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని