Punjab: రైతులపై కేసులు వెనక్కు తీసుకోవాలి: పంజాబ్‌ సీఎం ఆదేశాలు

రైతులపై నమోదైన కేసుల విషయంలో పంజాబ్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ట్రాక్‌లపై నిరసన తెలిపిన అన్నదాతలపై కేసులను ఉపసంహరించుకోవాలని.....

Updated : 24 Sep 2022 16:30 IST

చండీగఢ్‌: రైతులపై నమోదైన కేసుల విషయంలో పంజాబ్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ట్రాక్‌లపై నిరసన తెలిపిన అన్నదాతలపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)కు లేఖ రాశారు. తమ ఆదేశాలను ఆర్‌పీఎఫ్ ఛైర్మన్ వెంటనే పాటించాలని.. నిరసన తెలిపిన రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని సీఎం చన్నీ ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన మరుసటి రోజే పంజాబ్‌ సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నూతన ముఖ్యమంత్రిగా ఈమధ్యే బాధ్యతలు చేపట్టిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వ్యవసాయం, రైతుల సమస్యలపై ప్రధానితో దాదాపు గంటపాటు చర్చించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపించాలని మోదీని కోరినట్లు చరణ్‌జిత్‌ వెల్లడించారు. నిరసన తెలుపుతున్న రైతులతో తిరిగి చర్చలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉందని.. రైతులు, వ్యవసాయ కూలీలు సంతోషంగా ఉంటే రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తుందని ప్రధానికి తెలియజేసినట్లు చన్నీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని