Mallikarjun Kharge: ఖర్గేపై రూ.100కోట్ల పరువునష్టం దావా.. కోర్టు సమన్లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly election) ప్రచారంలో కాంగ్రెస్ పేర్కొన్న అంశం ఇప్పుడు కోర్టుకు చేరింది. బజరంగ్ దళ్ వివాదంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)కు సమన్లు జారీ అయ్యాయి.
చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress party chief Mallikarjun Kharge)కు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీచేసింది. బజరంగ్ దళ్ వివాదంలో ఆయనపై దాఖలైన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో ఈ సమన్లు ఇచ్చింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశమే అందుకు కారణమైంది.
అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ(PFI)సంస్థలపై నిషేధం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనడం రాజకీయ రగడకు తెరతీసింది. దీనిపై హిందూ సంఘం నేత ఒకరు పరువు నష్టం కేసు వేయగా.. పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు ఖర్గే(Mallikarjun Kharge)కు సమన్లు జారీచేసింది. అయితే.. ఎన్నికలకు ముందే.. తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ తన హామీపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. బజరంగ్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన ఏదీలేదని స్పష్టం చేసింది.
ఇటీవల వెల్లడైన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 224 అసెంబ్లీ స్థానాలకు గానూ..135 చోట్ల హస్తం పార్టీ జెండా రెపరెపలాడింది. ఇక భాజపా (BJP) 66 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. జేడీఎస్ (JDS) 19 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం