Punjab: గన్‌ కల్చర్‌పై ఉక్కుపాదం.. 813 తుపాకీ లైసెన్సులు రద్దు

గన్‌కల్చర్‌ను నిరోధించడమే లక్ష్యంగా పంజాబ్‌ ప్రభుత్వం 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది. 

Published : 13 Mar 2023 00:09 IST

చండీగఢ్‌: రాష్ట్రంలో పెరుగుతోన్న గన్‌ కల్చర్‌(Gun culture)ను అంతం చేయడమే లక్ష్యంగా పంజాబ్‌(Punjabలోని భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) సర్కార్‌ కీలక చర్యలు చేపట్టింది.  పంజాబ్‌(Punjab)లో 813 తుపాకీ లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.  నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు గతంలో జారీ చేసిన ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది. రద్దు చేసినవాటిలో లుథియానా గ్రామీణ ప్రాంతంలో 87 లైసెన్సులు ఉండగా.. షాహిద్‌ భగత్‌సింగ్‌నగర్‌లో 48, గురుదాస్‌పూర్‌ 10, ఫరీద్‌కోట్‌ 84, పఠాన్‌కోట్‌ 199, హోషియాపూర్‌ 47, కపుర్తలా 6, ఎస్‌ఏఎస్‌ కస్బా 235, సంగ్రూర్‌ 16 చొప్పున ఉన్నాయి.  అమృత్‌సర్‌ కమిషనరేట్‌ పరిధిలో నేర చరిత్ర కలిగిన వారి నుంచి 27 ఆయుధాల లైసెన్సుల్ని రద్దు చేయగా.. జలంధర్‌ కమిషనరేట్‌ పరిధిలో 11, ఇతర జిల్లాల్లోనూ ఆయుధాల లైసెన్సులు రద్దు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా పంజాబ్‌ ప్రభుత్వం 2వేలకు పైగా ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది.

తుపాకులు ఉంచేందుకు ఆయా వ్యక్తులు నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని; పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలను తీసుకెళ్లడం లేదా ప్రదర్శించడంపై నిషేధం ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. గన్‌ కల్చర్‌ను అంతం చేయడమే లక్ష్యంగా వచ్చే రోజుల్లో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నట్టు పేర్కొంది.  పంజాబ్‌లో మొత్తం 3,73,053 ఆయుధాల లైసెన్స్‌లు ఉండగా.. వీటిలో అత్యధికం గురుదాస్‌పూర్‌లోనేనని ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. ఆప్‌ ఎమ్మెల్యే ఇంద్రజీత్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని