Python eggs hatched artificially: కొండచిలువ గుడ్లను పొదిగించారు!

ఎక్కడైనా కోడి, ఇతర పక్షుల గుడ్లను కృత్రిమంగా పొదిగించడం విన్నాం.. చూశాం. కానీ కర్ణాటకలోని మంగళూరు సమీపంలో కొండచిలువ గుడ్లను కృత్రిమంగా పొదిగించి 8 పిల్లల్ని అటవీ అధికారుల సహకారంతో సురక్షితంగా

Updated : 25 Jun 2022 11:11 IST

మంగళూరు, న్యూస్‌టుడే: ఎక్కడైనా కోడి, ఇతర పక్షుల గుడ్లను కృత్రిమంగా పొదిగించడం విన్నాం.. చూశాం. కానీ కర్ణాటకలోని మంగళూరు సమీపంలో కొండచిలువ గుడ్లను కృత్రిమంగా పొదిగించి 8 పిల్లల్ని అటవీ అధికారుల సహకారంతో సురక్షితంగా అడవిలో వదిలారు. పది గుడ్లను పొదిగించగా రెండు మురిగిపోయినట్లు గుర్తించారు. ఈ వినూత్న ప్రయోగానికి పాముల సంరక్షకులు కిరణ్‌, అజయ్‌ ముందడుగు వేశారు. డొంగరకేరి గ్రామంలోని వేంకటేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న కట్టడాన్ని కూలుస్తుండగా శమీత్‌ సువర్ణ అనే వ్యక్తి పది కొండచిలువ గుడ్లను గుర్తించారు. వీటి గురించి కిరణ్‌, అజయ్‌లకు సమాచారం అందించారు. వారిద్దరూ వివరాలు సేకరించి, విజయవంతంగా ఆ గుడ్లను పొదిగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని