Flight: దిల్లీ నుంచి వెళ్లిన విమానంలో పొగలు.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

ఖతార్‌ నుంచి భారత్‌కు వచ్చే ఓ విమానం కార్గోలో పొగలు వ్యాపించాయి. దీంతో ఈ విమానాన్ని దారిమళ్లించి కరాచీలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన

Updated : 21 Mar 2022 13:47 IST

దిల్లీ: దిల్లీ నుంచి ఖతార్‌ వెళ్లే ఓ విమానం కార్గోలో పొగలు వ్యాపించాయి. దీంతో ఈ విమానాన్ని దారిమళ్లించి కరాచీలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్‌ 579 విమానం సోమవారం తెల్లవారుజామున  100 మందికి పైగా ప్రయాణికులతో దిల్లీ నుంచి దోహాకు బయల్దేరింది. అయితే కాసేపటికే కార్గోలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే విమానాన్ని దారిమళ్లించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

2 గంటల తర్వాత విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేసినట్లు ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని, అందులోని ప్రయాణికులను బయటకు పంపిచినట్లు తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ప్రయాణికులను మరో విమానంలో పంపిస్తామని పేర్కొంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు తెలిపింది. అయితే ఘటనపై ప్రయాణికులు ఆందోళన చెందారు. చాలా మందికి కనెక్టెడ్‌ ఫ్లైట్స్‌ ఉన్నాయని, కరాచీ నుంచి ఎప్పుడు తీసుకెళ్తారో విమాన సిబ్బంది చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని