Published : 27/11/2021 15:00 IST

Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్‌లో ఉండండి’

ముంబయి: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇజ్రాయెల్‌, బెల్జియం, బోట్స్‌వానా తదితర దేశాలకు పాకడంతో.. అక్కడినుంచి రాకపోకలపై బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడ ఈ విషయమై అప్రమత్తమైంది. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్‌ నిబంధన విధిస్తున్నట్లు నగర మేయర్ కిశోరీ పేడ్నేకర్‌ శనివారం ప్రకటించారు. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే, సంబంధిత ప్రయాణికుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపుతామని తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని..

‘మహమ్మారి కొత్త వేరియంట్ విషయంలో ముంబయిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అయితే.. ఇక్కడినుంచి వెళ్లే విమానాలపై మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మేయర్‌ వివరించారు. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష కోసం ఉన్నతాధికారులతో భేటీ అయిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని