ఎర్రకోట ఘటనలో మరో వ్యక్తి అరెస్ట్‌!

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద జెండా ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించగా......

Published : 22 Feb 2021 23:51 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద జెండా ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించగా.. మరో కీలక వ్యక్తిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎర్రకోటపైకి ఎక్కడమే కాకుండా కత్తులతో విన్యాసం చేస్తూ ఆందోళనకారులను హింసకు ప్రేరేపించారనే ఆరోపణలపై పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీలోని స్వరూప్‌ నగర్‌కు చెందిన జస్‌ప్రీత్‌ సింగ్‌(29)ను ఎర్రకోట ఘటనలో మరో కీలక వ్యక్తిగా భావిస్తున్న దిల్లీ పోలీసులు, సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ యువకుడితో పాటు కోటపైకి ఎక్కిన వ్యక్తుల్లో కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోలు, ఫోటోల ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే అరెస్టైన మహీందర్‌ సింగ్‌, ఎర్రకోటపైకి ఎక్కేందుకు మొత్తం ఆరుగురిని పురమాయించినట్లు పోలీసులు గుర్తించారు. హింసను ప్రేరేపించే విధంగా ప్రవర్తించడంతోపాటు వారి చేతుల్లో ఉన్న కత్తులతో అక్కడి పోలీసులను కూడా బెదిరించినట్లు దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని