Corona virus: 1 కంటే దిగువకు ఆర్‌ ఫ్యాక్టర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ‘ఆర్‌ ఫ్యాక్టర్‌ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌)’ దేశంలో 1 కంటే దిగువకు తగ్గింది.

Updated : 19 Aug 2021 15:36 IST

భారత్‌లో వైరస్‌ వ్యాప్తి తగ్గుదలకు సూచిక
పరిశోధకుల వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ‘ఆర్‌ ఫ్యాక్టర్‌ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌)’ దేశంలో 1 కంటే దిగువకు తగ్గింది. ఈ నెల ప్రారంభంలో ఇది ఆందోళనకర రీతిలో 1 దాటిన సంగతి తెలిసిందే. తాజాగా 0.89కి తగ్గినట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు వెల్లడించారు. ఆర్‌ ఫ్యాక్టర్‌ 1 అంటే.. ఇన్‌ఫెక్షన్‌కు గురైన ప్రతి 100 మంది ద్వారా మరో 100 మందికి వైరస్‌ సంక్రమిస్తుంది. ఇది 1 లోపు ఉంటే కొత్తగా కొవిడ్‌ బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సేవల వ్యవస్థపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. దేశంలో కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న కేరళ, మహారాష్ట్రల్లోనూ ఇది 1 కంటే తక్కువ ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం ఆర్‌ ఫ్యాక్టర్‌ 1ని మించి ఉండగా.. తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో 1కి చేరువగా ఉన్నట్లు పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న సిత్‌బర సిన్హా తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు