మీది అభివృద్ధా.. విధ్వంసమా: రాహుల్‌

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తోందా.. లేదా నాశనం చేస్తోందా? అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 19 Nov 2020 02:09 IST

దిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తోందా.. లేదా నాశనం చేస్తోందా? అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రాహుల్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు.

‘దేశ జీడీపీ దిగజారుతోంది. దేశంలోని బ్యాంకులు సైతం ఇబ్బందుల్లో పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజలకు మనోధైర్యం తగ్గుతోంది. రోజురోజుకు సామాజిక న్యాయం సన్నగిల్లుతోంది. దేశంలో అభివృద్ధి జరుగుతోందా.. లేదా విధ్వంసం జరుగుతోందా?’ అంటూ రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే చాలాసార్లు మోదీ ప్రభుత్వం తమ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందంటూ నిందిస్తున్న విషయం తెలిసిందే. 

అమిత్‌జీ.. మీది ఏ గ్యాంగ్‌ మరి?: కపిల్‌ సిబల్‌

కాంగ్రెస్‌ ఇక ప్రత్యామ్నాయం కాదు: సిబల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని