Samatha Murthy: సమతా మూర్తి విగ్రహంపై రాహుల్‌ ఆసక్తికర ట్వీట్‌

హైదరాబాద్‌లోని సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని

Updated : 09 Feb 2022 14:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని చైనాలో తయారుచేశారు. ‘నవ భారత్‌’ అంటే చైనా-నిర్భరేనా?’’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించారు. 

హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత శనివారం ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ విగ్రహాన్ని చైనాలోని ఏరోసన్‌ కార్పొరేషన్‌ సంస్థ తయారుచేసింది. ఇందుకోసం 2015లోనే ఆ కంపెనీ కాంట్రాక్ట్‌ తీసుకుంది. విగ్రహం ప్రధాన వర్క్‌ అంతా చైనాలోనే పూర్తిచేసి 1600 విడి భాగాలుగా భారత్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత 15 నెలల పాటు శ్రమించి ఆ భాగాలను లేయర్ల వారీగా అతికించారు. విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్‌, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు. ప్రపంచంలోనే కూర్చుని ఉన్న విగ్రహాల్లో ఇది రెండో అతిపెద్దది కావడం విశేషం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని