
Gas Cylinder: ఇప్పుడు ఒక సిలిండర్ ధరకు అప్పట్లో రెండు వచ్చేవి : రాహుల్‌గాంధీ
ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత
దిల్లీ: దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను మోదీ ప్రభుత్వం భారీగా పెంచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తమ హయాంలో కంటే ప్రస్తుత భాజపా పాలనలో ఇంధన ధరలు రెండింతలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఒక సిలిండర్ వంటగ్యాస్ ధరకు 2014లో రెండు సిలిండర్లు వచ్చేవని గుర్తుచేస్తూ మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
‘ప్రస్తుతం 1 సిలిండర్ వంట గ్యాస్ ధరకు అప్పట్లో రెండు సిలిండర్లు వచ్చేవి. 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.410 ఉండగా.. సిలిండర్‌పై రూ.827 సబ్సిడీ అందించాం. కానీ, ప్రస్తుతం భాజపా హయాంలో ఎల్పీజీ ధర రూ.999కు చేరింది. సబ్సిడీ మాత్రం సున్నా’ అని పోల్చుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్న ఆయన.. అదే మన ఆర్థికవ్యవస్థ విధానంలో అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు.
ఇదిలాఉంటే, ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మోతమోగిస్తుండగా తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచడంపై ఆయిల్ సంస్థలు దృష్టిపెట్టాయి. శనివారం నాడు ఒక సిలిండర్ ధర రూ.50 పెరిగింది. గడిచిన ఆరు వారాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. దీంతో దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో 14.2కిలోల సిలిండర్ వంటగ్యాస్ ధర వెయ్యికి చేరువకాగా.. హైదరాబాద్‌లో రూ.1052కి చేరింది. తెలంగాణలోని పలు పట్టణాల్లో సిలిండర్ ధర రూ.1070కి పెరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్
-
Business News
Credit cards: క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు.. ఈ కామర్సుల్లోనే ఎక్కువ!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
COVID cases: తెలంగాణలో భారీగా కొవిడ్ కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే?
-
Politics News
Andhra News: సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఆవేదన
-
Politics News
Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్