Rahul Gandhi: ‘మీ తరఫున గళమెత్తుతా’.. బాధితులకు రాహుల్‌ హామీ

గుజరాత్‌లో కొన్నేళ్లలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరామర్శించారు. 

Published : 06 Jul 2024 20:40 IST

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. కొన్నేళ్లలో వివిధ ఘటనలు, ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. లోక్‌సభలో సమస్యలపై ప్రజల తరఫున గళమెత్తుతానని మాటిచ్చారు.

ఇటీవల రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్‌ గాంధీ పరామర్శించినట్లు కాంగ్రెస్‌ తెలిపింది. 2022లో మోర్బి వంతెన కూలడం, రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో అగ్నిప్రమాదం, ఇతర ప్రమాదాలకు ప్రభావితమైన బాధితులు కాంగ్రెస్‌ కార్యాలయంలోని రాహుల్‌ని కలిసి సమస్యలను చెప్పుకున్నారు.

ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!

ఆయా ప్రమాదాలకు కారణమైన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. ఏళ్లుగా పోరాడుతున్నా తమకు న్యాయం జరగడం లేదని మొరపెట్టుకున్నారు. బాధితుల సమస్యలను విన్న రాహుల్‌.. వారి తరఫున లోక్‌సభలో గళమెత్తుతానంటూ హామీ ఇచ్చారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతానంటూ బాధిత కుటుంబాలకు మాటిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని