Lakhimpur Kheri violence: జోడో యాత్రకు రైతు ఉద్యమమే ప్రేరణ: రాహుల్ గాంధీ

ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. లఖింపుర్ ఖేరీ ఘటనపై స్పందించారు.

Updated : 11 Oct 2022 11:27 IST

దిల్లీ: లఖింపుర్ ఖేరీ ఘటన జరిగి ఏడాది అయినా.. ఇంతవరకు న్యాయం దక్కలేదని భాజపాపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇంకా అజయ్ మిశ్రా కేంద్రంలో కొనసాగడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. 

‘లఖింపుర్ ఘటన జరిగి ఏడాది అయినా.. అమరవీరులైన రైతులకు న్యాయం దక్కలేదు. కారణం తెలిసిందే. ఎప్పటిలాగే భాజపా నేరస్థులను కాపాడుతోంది. మేం ప్రారంభించిన జోడో యాత్రకు రైతు ఉద్యమమే ప్రేరణ. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం సాగుతుంది’ అన్నారు. వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తోన్న రైతులను ఉద్దేశపూర్వంగా చంపిన నిందితుడి తండ్రి ఇప్పటికీ కేంద్రంలో కొనసాగుతున్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ఇంతకుమించిన అవమానం మరొకటి లేదన్నారు. 

లఖింపుర్‌లో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి గత ఏడాది అక్టోబర్ 3న ఆశిశ్ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన వీడియోలో రైతులపైకి ఎస్‌యూవీ వాహనం వేగంగా దూసుకెళ్లినట్లు కనిపించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్‌ మిశ్రా ప్రధాన నిందితుడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts