‘షారుక్‌.. రాజకీయ నేతలకు మీ సలహా ఏంటి?’: నటుడిని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

స్టార్‌ హీరో షారుక్ ఖాన్‌, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలు వారిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు..? ఏం మాట్లాడుకున్నారంటే..?

Published : 14 Apr 2023 19:35 IST

దిల్లీ: బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan ), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi )కి మధ్య జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘రాజకీయ నాయకులకు మీరిచ్చే సలహా ఏంటి..?’ అంటూ రాహుల్‌ ఆయన్ను ప్రశ్నించారు. 2008లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా షారుక్‌ ఈ ప్రశ్న ఎదురైంది. 

అప్పుడు ఆ స్టార్‌ హీరో(Shah Rukh Khan ) నవ్వుతూ.. ‘హమ్మయ్య చాలా సులభమైన ప్రశ్న అడిగారు. నేను అబద్ధాలు చెప్తాను, మోసం చేస్తాను. ఒక నటుడిగా అన్ని రూపాలను ప్రదర్శిస్తాను. కానీ.. ఈ సందర్భంగా మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. దేశం కోసం పనిచేస్తోన్న, పనిచేయాలని కోరుకుంటున్న వారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. దేశం కోసం పనిచేయడం ఒక నిస్వార్థ సేవ. ఈ క్రమంలో నేతలు అవినీతిని ప్రోత్సహించవద్దు. చీకటి ఆర్జన చేయొద్దు. నేతలంతా దీనిని వ్యతిరేకిస్తే.. మనమంతా డబ్బు సంపాదించుకోవచ్చు. అందరం సంతోషంగా ఉంటాం. ఇక్కడ నా సలహా ఏంటంటే.. నేతలంతా దయచేసి సాధ్యమైనంత నిజాయతీగా ఉండండి’ అంటూ బదులిచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ షేర్ చేయగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో షారుక్‌ చెప్పిన మాటలను నెటిజన్లు ఆమోదిస్తూ కామెంట్లు పెట్టారు. 

అప్పటి కార్యక్రమంలో రాహుల్‌ (Rahul Gandhi )తో పాటు భాజపా నేతలు ప్రకాశ్‌ జావడేకర్, రవి శంకర్‌ ప్రసాద్‌ వంటి నేతలు కూడా ఉన్నారు. షారుక్‌(Shah Rukh Khan ) సూటిగా చెప్పిన ఈ సమాధానాన్ని ఆడియెన్స్ చప్పట్లతో అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని