Congress: కేంద్రంపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు.. పోలీసుల అదుపులో రాహుల్

పెట్రోల్, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్‌ వంటి అంశాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తారని, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ నివాసం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు ఇప్పటికే హస్తం పార్టీ ఇదివరకే ప్రకటించింది.

Published : 05 Aug 2022 13:33 IST

దిల్లీ: పెట్రోల్, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్‌ వంటి అంశాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తారని, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ నివాసం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు ఇప్పటికే హస్తం పార్టీ ప్రకటించింది. అందుకు తగ్గట్టే ఈ రోజు నిరసనలకు దిగింది. దిల్లీలో పార్టీ కేంద్రకార్యాలయం సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా అంతా నలుపుదుస్తులు ధరించి, నిరసన చేపడుతున్నారు. వారంతా పార్లమెంట్‌కు నలుపు దుస్తుల్లోనే హాజరయ్యారు. విపక్షాల గందరగోళంతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వాయిదాల పర్వం కొనసాగింది.

కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా దిల్లీ యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. దేశ రాజధానిలో కాంగ్రెస్ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే దారిలో పారామిలిటరీ బలగాలు, దిల్లీ పోలీసుల్ని మోహరించారు. బారికేడ్లు పెట్టి నిరసనకారులను అడ్డుకున్నారు. పార్లమెంట్ వద్ద ఆందోళనలకు సోనియా గాంధీ నేతృత్వం వహిస్తున్నారు. అలాగే అక్కడ ధర్నాకు కూర్చున్న  రాహుల్ గాంధీ, అధిర్‌ రంజన్ చౌధరీ, కేసీ వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని