Gujarat Polls: గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఘోర పరాజయంపై.. రాహుల్‌ గాంధీ ఏమన్నారంటే..!

గుజరాత్‌లో భాజపా భారీ మెజార్టీతో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలయ్యింది. అయితే, హిమాచల్‌లో గెలిచి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. 

Published : 09 Dec 2022 01:37 IST

దిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. గుజరాత్‌ ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నట్టు చెప్పారు. పార్టీలో పునర్వ్యవస్థీకరణ చేపడతామని.. మరింతగా కష్టపడి పని చేస్తామన్నారు. దేశ ఆదర్శాలు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపుపై స్పందించిన ఆయన.. ‘ఈ నిర్ణయాత్మక విజయంపై హిమాచల్‌ వాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రమ, అంకితభావంతో కృషి చేసిన కాంగ్రెస్‌ శ్రేణులకు శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని మరోసారి హామీ ఇస్తున్నా’ అని అన్నారు.

ఇదిలాఉంటే, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా ఏడోసారి విజయం సాధించిన భాజపా.. ఈసారి 156 సీట్లలో గెలుపొంది రికార్డు సృష్టించింది. కాంగ్రెస్‌ మాత్రం 2017లో 77 చోట్ల విజయం సాధించగా.. ఈసారి ఘోర పరాజయం పాలై 17 స్థానాలకే పరిమితమయ్యింది. హిమాచల్‌లో మాత్రం 40స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టడానికి సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని