Rahul Gandhi: ఎంపీగా రాహుల్‌ గాంధీ ప్రమాణం

Rahul Gandhi: లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయం ఆయన చేతిలో రాజ్యాంగం చిరు ప్రతిని పట్టుకుని కన్పించారు. 

Updated : 25 Jun 2024 17:05 IST

దిల్లీ: 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌.. సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్‌ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని  వయనాడ్‌ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్‌ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

స్పీకర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?

నేటితో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కానుంది. బుధవారం (జూన్‌ 26న) స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా భాజపా నేత ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు ఈ సాయంత్రం వరకు గడువు ఉంది. ఆలోపు విపక్షాలు వెనక్కి తగ్గకపోతే రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని