Rahul Gandhi: ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ సందడి షురూ.. దిల్లీలో రైలెక్కిన రాహుల్‌!

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే కాంగ్రెస్‌ నవసంకల్ప్‌ చింతన్‌ శివిర్‌ మేథోమధన సదస్సుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సర్వం.....

Published : 13 May 2022 02:26 IST

దిల్లీ: శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే కాంగ్రెస్‌ నవసంకల్ప్‌ చింతన్‌ శివిర్‌ మేథోమధన సదస్సుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతల రాకతో అక్కడ రాజకీయ సందడి మొదలైంది. రేపట్నుంచే సదస్సు ప్రారంభం కానుండటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీలో రైలులో బయల్దేరారు. రొహిల్లా రైల్వే స్టేషన్‌లో చేతిలో బ్యాగ్‌ పట్టుకొంటూ సామాన్య ప్రయాణికుడిలా కనిపించారు. ఆయన రాకతో రైల్వే స్టేషన్‌లో సందడి వాతావరణం నెలకొంది. రైల్వే స్టేషన్‌లో రాహుల్‌ గాంధీ రైల్వే కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాహుల్‌తో పాటు దాదాపు 50 మందికి పైగా కాంగ్రెస్‌ నేతలు రైలులో బయల్దేరారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు కాంగ్రెస్‌ మేథోమధన సదస్సు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకోసం రాహుల్‌తో పాటు పలువురు కీలక నేతలు రైలులో బయల్దేరాలని అనుకొని.. రెండు బోగీలను కూడా బుక్‌ చేసుకున్నారు. ఈ సదస్సులో దాదాపు 422 మంది నేతలు పాల్గొని తమ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణపై కీలక మథనం సాగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని