Rahul Gandhi: జైలు శిక్షను సవాల్‌ చేస్తూ రేపే రాహుల్‌ పిటిషన్‌?

Rahul Gandhi: తనని దోషిగా తేలుస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్‌ (Rahul Gandhi) తన వ్యాజ్యంలో కోరనున్నట్లు తెలుస్తోంది.

Published : 02 Apr 2023 10:41 IST

దిల్లీ: తనపై గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రేపు (2023 ఏప్రిల్‌ 03) సూరత్‌ సెషన్స్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. న్యాయనిపుణులతో కలిసి ఇప్పటికే పిటిషన్‌ను తయారు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో తనని దోషిగా తేలుస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్‌ (Rahul Gandhi) తన వ్యాజ్యంలో కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెషన్స్‌ కోర్టులో దీనిపై తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్‌ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: రాహుల్‌పై మరో పరువు నష్టం కేసు)

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్‌) కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ (Rahul Gandhi)కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్ష పడిన ఆయనపై లోక్‌సభ సచివాలయం వెంటనే అనర్హత వేటు వేసింది. అధికారిక నివాసాన్నీ ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో రాహుల్‌ అంశంపై న్యాయపరంగా పిటిషన్‌ వేయడానికి నేతలు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని