BJP: రాహుల్‌.. విదేశీ జోక్యం కోరి భారత్‌ పరువు తీస్తారా..?

విదేశీ గడ్డపై భారతదేశం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఆయన మాటలను భాజపా తీవ్రంగా ఖండిస్తోంది. 

Published : 08 Mar 2023 00:15 IST

దిల్లీ: యూకే(UK) పర్యటనలో భాగంగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను భాజపా(Bjp) తీవ్రంగా విమర్శిస్తోంది. విదేశాల జోక్యాన్ని కోరడం ద్వారా విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘రాహుల్ గాంధీ తన ప్రసంగాల ద్వారా భారత ప్రజాస్వామ్యం, పార్లమెంట్‌, రాజకీయ వ్యవస్థ, న్యాయవ్యవస్థ పరువు తీస్తున్నారు. ఈ విషయంలో భాజపా తీవ్ర ఆవేదనకు గురవుతోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అమెరికా, ఐరోపా జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరుకుంటున్నారా..? ఏ పార్టీ  అధికారంలో ఉందన్నది ఇక్కడ విషయం కాదు. మన అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఏ విదేశమూ జోక్యం చేసుకోకూడదు. ఖర్గేజీ.. మీరు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తారా..? మీ ఉద్దేశం మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. వాటిని మీరు అంగీకరించకపోతే.. ఖండించండి. సోనియాజీ.. రాహుల్((Rahul Gandhi) చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలపై మీ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతున్నాం’ అని భాజపా అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్‌( Ravi Shankar Prasad) అన్నారు.

ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్((Rahul Gandhi) మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య పరిరక్షకులైన అమెరికా, ఐరోపా.. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు