మీ విధానాలతో భారత్‌ను బాధితురాలిగా మార్చొద్దు

కరోనా మహమ్మారిపై చేస్తోన్న పోరాటంలో..భారత్‌ను భాజపా విధానాలకు బాధితురాలిగా మార్చొద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Published : 26 Apr 2021 13:27 IST

భాజపాపై రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

దిల్లీ: కరోనా మహమ్మారిపై చేస్తోన్న పోరాటంలో..భారత్‌ను భాజపా విధానాలకు బాధితురాలిగా మార్చొద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా ఉచితంగా అందించాల్సిందేనని సోమవారం ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

‘చర్చించింది చాలు. పౌరులంతా తప్పనిసరిగా ఉచితంగా టీకా పొందాలి. దీనిపై ఇక చర్చించాల్సిన పనిలేదు. భారత్‌ను భాజపా విధానాలకు బాధితురాలిగా మార్చొద్దు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేగాక టీకాల కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 50 శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించొచ్చని తెలిపింది. దాంతో టీకా సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. ఈ వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఒకే దేశం ఒకే పన్ను అని చెబుతూ.. ఒకే దేశం రెండు వ్యాక్సిన్ల ధరలా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాగా, కరోనా టీకాలపై వస్తున్న అన్ని రకాల వదంతుల్ని ప్రధాని మోదీ కొట్టిపారేశారు. ఆయన మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ..అర్హులందరికీ కేంద్రమే ఉచితంగా టీకా అందజేస్తుందని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని