పట్టాలెక్కనున్న మరో 660 రైళ్లు

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. డిమాండ్ దృష్ట్యా జూన్ నెల‌లో మరో 660 రైళ్లను న‌డిపేందుకు...

Published : 18 Jun 2021 23:56 IST

దిల్లీ: దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. డిమాండ్ దృష్ట్యా జూన్ నెల‌లో మరో 660 రైళ్లను న‌డిపేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ప్రజలు, వలస కూలీలు దేశంలోని పలు ప్రాంతాల‌కు వెళ్లేందుకు వీలుగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తారు. జోన్ల వారీగా ఉన్న ప్రయాణికుల వెయిటింగ్ జాబితాను తగ్గించడానికి అదనపు రైళ్లను నడుపుతారు. స్థానికంగా ఉన్న కరోనా కేసులు, టిక్కెట్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైళ్లను గ్రేడెడ్ పద్ధతిలో పునరుద్ధరించాలని జోన్లకు రైల్వేశాఖ సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని