Vande Bharat: టికెట్‌ లేని ప్రయాణికులతో వందే భారత్‌ రష్‌.. స్పందించిన రైల్వే శాఖ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్‌.. టికెట్ లేని ప్రయాణికులతో కిక్కిరిసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రైల్వేశాఖ స్పందించింది.

Published : 12 Jun 2024 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణ రైళ్లు సామాన్య ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటాయి. కొందరు టికెట్‌ కొనుగోలు చేయకుండా ప్రయాణిస్తూ టీసీకి దొరికిపోయిన సందర్భాలు చాలానే చూశాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైలు (Vande Bharat trains) లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ రైలు.. టికెట్‌ కొనుగోలు చేయకుండా ప్రయాణిస్తున్న వారితో కిటకిటలాడింది. లఖ్‌నవూ నుంచి డెహ్రడూన్‌ మధ్య ప్రయాణించిన వందే భారత్‌ రైలులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఓ వ్యక్తి ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తడంపై ఆందోళన వ్యక్తంచేశారు. నెటిజన్లు స్పందిస్తూ.. దేశంలో మరికొన్ని రైళ్లను నిర్మించడం లేదా బోగీలను పెంచే ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.

ట్యాంకర్‌ మాఫియా నీటిని మింగేస్తుంటే ఏం చేస్తున్నారు..?

  వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఉత్తర రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని స్పష్టంచేసింది. ‘‘కొందరు రైతులు బలవంతంగా రైలులోకి ఎక్కినప్పుడు జరిగిన సంఘటన ఇది. పాత వీడియోను ప్రస్తుతం షేర్‌ చేశారు. దయచేసి ఇలాంటివి ప్రచారం చేయకండి. ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోండి’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని