Railway Board: 1.78 కోట్ల మందికి ఫైన్‌.. ₹1000 కోట్లు వసూలు

తొమ్మిది నెలల కాలంలో 1.78 కోట్ల మంది వద్ద జరిమానాలు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది......

Published : 21 Feb 2022 01:33 IST

దిల్లీ: తొమ్మిది నెలల కాలంలో 1.78 కోట్ల మంది ప్రయాణికుల నుంచి జరిమానాలు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. 2021-22 మొదటి తొమ్మిది నెలల్లో.. టికెట్లు లేకుండా, అదనపు లగేజీకి రుసుము చెల్లించకుండా ప్రయాణించిన వారివద్ద నుంచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐలో దాఖలు చేసిన ప్రశ్నకు రైల్వే బోర్డు స్పందించింది. ఇందుకు సంబంధించిన డేటాను అందుబాటులోకి తెచ్చింది.

2021 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో ప్రయాణ, ఫ్లాట్‌ఫామ్‌, లగేజీ టికెట్‌ లేకుండా ఉన్న 1.78 కోట్ల మందిని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో ₹1,017.48కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ వసూళ్లు 2019-2020 కంటే 79 శాతం అధికమని వివరించింది. కొవిడ్‌ నిబంధనల ఎత్తివేతతో పెరిగిన ప్రయాణాలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌తో చాలా మంది బుక్‌ చేసుకోకుండానే రైలు ఎక్కడం భారీ జరిమానాలకు కారణమని ఓ అధికారి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని