Non AC coaches: పెరగనున్న నాన్ ఏసీ కోచ్‌లు.. రెండేళ్లలో 10వేలు అందుబాటులోకి

కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండేళ్లలో 10 వేల నాన్‌- ఏసీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Published : 09 Jul 2024 20:12 IST

దిల్లీ: సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సామాన్యులు ఎక్కువగా ఎంచుకునేది రైలు మార్గాన్నే. ఈ నేపథ్యంలో వారి కోసం కేంద్ర రైల్వేశాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేలకు పైగా నాన్‌- ఏసీ కోచ్‌లను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో  అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని భారత రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సాధారణ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వచ్చే రెండేళ్లలో నాన్‌- ఏసీ కోచ్‌లను 22 శాతం పెంచనుంది. రెండేళ్ల  ప్రణాళికను ప్రకటనలో వివరించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 2,605 జనరల్ కోచ్‌లు, 1,470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లతో పాటు 323 సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్ (ఎస్‌ఎల్‌ఆర్) కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. కోచ్‌లతో పాటు అధిక సామర్థ్యం గల 32 పార్శిల్‌ వ్యాన్‌లు, 55 ప్యాంట్రీ కార్లను కూడా తయారు చేయనున్నారు.

హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటీ? సిట్‌ నివేదిక ఏం చెప్పిందంటే..!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని