ఆక్సిజన్‌ సరఫరా ట్రక్కులు ప్రారంభం

రైల్వే ద్వారా దేశంలో పలు ప్రాంతాలకు ఆక్సిజన్‌ ట్రక్కుల రవాణాను సోమవారం సాయంత్రం నుంచే మొదలు పెడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

Updated : 19 Apr 2021 16:48 IST

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆక్సిజన్‌ కొరత ఉన్న ప్రాంతాలకు ట్రక్కులు పంపిణీని కేంద్రం ప్రారంభించింది. రైల్వే ద్వారా దేశంలో పలు ప్రాంతాలకు ఆక్సిజన్‌ ట్రక్కుల రవాణాను సోమవారం సాయంత్రం నుంచే మొదలు పెడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. భారత ఆర్మీ సహకారంతో దేశంలోని పలు ప్రదేశాలకు 32 వ్యాగన్లలో ఆక్సిజన్‌ ట్రక్కులు పంపుతున్న తెలిపింది. దిల్లీ సమీపంలోని పల్వల్‌ నుంచి విశాఖపట్నం వరకు 32 వ్యాగన్లతో కూడిన ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఇందుకోసం భారత సైన్యం వద్ద ఉన్న.. క్లిష్టమైన రోలింగ్ స్టాక్‌లను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని