హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ధర్మశాలలో

Published : 12 Jul 2021 23:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ధర్మశాలలో వీధుల్లో నిలిపిన కార్లు వరదలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

కాంగ్రా జిల్లాలో ఆదివారం కురిసిన వర్షం కారణంగా ధర్మశాల పరిసర ప్రాంతాల్లో నదులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి రోడ్డుపై ఉన్న కారులు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. వరదల వల్ల మంజీనది పరిసరాల్లో సుమారు పది దుకాణ సముదాయాలు దెబ్బతిన్నాయి. పర్యాటకులు, ప్రజలు నది పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని